
- ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్
బషీర్బాగ్, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు ట్రస్ట్ చైర్మన్ ఆర్.కె.జైన్, వైస్ చైర్మన్ జస్మత్ పటేల్ తెలిపారు. బేగంబజార్ లోని ట్రస్ట్ ఆఫీసులో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు.
హిందూ దేవాలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి పని చేస్తున్నామన్నారు. రెండేళ్ల కింద ప్రారంభమైన తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 10 దేవాలయాల పునర్నిర్మాణం చేపట్టామన్నారు. శ్రీలంకలో శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని అభివృద్ధి చేసి, విగ్రహ ప్రతిష్ఠ చేశామన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, దేశంలోని జమ్మూకశ్మీర్, తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల పునరుద్ధరణకు పని చేస్తామని స్పష్టం చేశారు.