
బషీర్‌బాగ్, వెలుగు: ‘హలో పద్మశాలీ.. చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని సక్సెస్చేయాలని అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి పిలుపునిచ్చారు. తమ హక్కుల సాధన కోసం ఈ నెల 9న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పద్మశాలీ మహా సభలు తలపెట్టినట్లు తెలిపారు.
సోమవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్ లో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో పద్మశాలీలకు దక్కాల్సిన వాటాలపై ఈ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.