భారతీయులంతా ఒక్కటే

భారతీయులంతా ఒక్కటే

గోదావరిఖని, వెలుగు: దేశంలో అనేక రాష్ట్రాలు, కులాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ భారతీయులంతా ఒక్కటే అని పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. ‘హర్‌‌‌‌‌‌‌‌ ఘర్‌‌‌‌‌‌‌‌ తిరంగా జెండా’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని తన నివాసంపై వివేక్​మువ్వన్నెల  జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు కౌశిక హరి, పి.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌, సాదుల రాంబాబు, పాకాల గోవర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తిప్పారపు మధు, నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.

ధర్మారంలో వివేక్ పర్యటన

పెద్దపల్లి, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం ధర్మారం మండలంలో పర్యటించారు. ఆయన వెంట బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడె సూర్యనారాయణ, బీజేపీ ధర్మారం మండల శాఖ అధ్యక్షులు యాళ్ల తిరుపతి రెడ్డి, పొన్నవేని స్వామి, దీపక్ తదితరులు 
పాల్గొన్నారు.