టిట్ బిట్స్ : శాతవాహనుల శాసనాలు

టిట్ బిట్స్ :  శాతవాహనుల శాసనాలు

1. దేవి నాగానిక – నానాఘాట్​ శాసనం మొదటి శాతకర్ణి విజయాలను పేర్కొంది.అశ్వమేధ యాగాల గురించి వివరాలున్నాయి.
2. కృష్ణుడు – నాసిక్​ శాసనం –1 నాసిక్​లో శ్రమణుల కోసం ఒక గుహను తొలిచినట్లు తెలుస్తుంది.
3. గౌతమీబాలశ్రీ – నాసిక్​ శాసనం –2 గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలు తెలుస్తున్నాయి.రెండో పులోమావి కాలంలో గౌతమీ బాలశ్రీ వేయించింది.
4. రెండో పులోమావి – అమరావతి శాసనం శాతవాహనుల రాజధాని ధరణికోట అని తెలుస్తుంది. తొలి తెలుగు పదం నాగబు ఈ శాసనంలో కనిపిస్తుంది.
5. యజ్ఞశ్రీ శాతకర్ణి – చిన్నగంజాం శాసనం
6. మూడో పులోమావి  – మ్యాకధోని శాసనం ఈ శాసనంలో గుల్మిక అనే పదం ప్రస్తావించబడింది.అల్లూరి శాసనం– ఈ శాసనం ప్రకారం బౌద్ధ సంఘం ఎడ్లబండ్లను దానంగా స్వీకరించి వర్తకులకు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తుంది.
7. రుషభదత్తుని శాసనంఒక సువర్ణం 35 కర్షపణాలతో సమానమని ఈ శాసనంలో పేర్కొన్నారు.వెండి, రాగితో చేసిన నాణేలను కర్షపణాలు అంటారు.
8. ఖారవేలుడు – హథీగుంఫ శాసనం ఖారవేలుడు మొదటి శాతకర్ణిపై చేసిన దాడిని తెలియజేస్తుంది. ఆనాటి చతురంగ బలాలను ప్రస్తావించింది. గుంటుపల్లి శాసనం ఆంధ్రప్రదేశ్​ ఖారవేలుడి దండయాత్రను తెలుపుతుంది.
9. రుద్రదాముడు – గిర్నార్​ శాసనందక్షిణపథ పాలకుడు యజ్ఞశ్రీ శాతకర్ణిని రెండు సార్లు రుద్రదాముడు ఓడించినట్లు ఈ శాసనంలో పేర్కొనబడింది.