మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం అయ్యింది. దేశ ఆర్థిక రాజధానిగా ముంభైని పిలుస్తారు. ముంభైలో పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. బాడా పొలిటికల్ లీడర్స్, గ్యాంగ్ స్టార్స్, సినీ ఆర్టీస్టులు, పెద్ద బిజినెస్ మ్యాన్లు ముంభైలోనే సెట్టిల్ అయ్యారు. ఇక్కడ రాజకీయం చాలా రంజుగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటైన శివసేన ప్రభుత్వం రెండు వర్గాలుగా చీలిపోయింది. 2022 జూన్ లో అవిశ్వాస తీర్మాణంతో ఉద్దావ్ టాక్రేను ముఖ్యమంత్రిగా తప్పించి.. ఏక్‌నాథ్ షిండే పాలనా పగ్గాలు తీసుకున్నాడు. తర్వాత మహారాష్ట్రలో రాజకీయా వెంటవెంటనే మారిపోయాయి.
పోలింగ్ 2024, నవంబర్ 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నది
ఈసారి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఉత్కంఠమైన ఎన్నికలుగా చెప్పవచ్చు.
పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి.
ఉద్దవ్ థాక్రే మొదటిసారి శివసేన సింబల్ పై పోటీ చేయటం లేదు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది.
బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమిగా.. మహాయుతి కూటమి కట్టింది
కూటమిలో భాగంగా బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తుంది
శివసేన (షిండే) 81 సీట్లలో పోటీ
ఎన్సీపీ (అజిత్ పవార్) 59 స్థానాల్లో పోటీ
ALSO READ | మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్
ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, శివసేన (యూటీబీ), ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు మహా వికాస్ అఘాడి కూటమిగా పోటీ ఇస్తున్నాయి.
కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తుంది
శివసేన (యూటీబీ ఉద్దవ్) 95 సీట్లలో పోటీ
ఎన్సీపీ (ఎస్పీ) అజిత్ పవార్ పార్టీ 86 సీట్లలో పోటీ చేస్తుంది
- ఈ రెండు కూటముల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
- ఇదే సమయంలో ఈసారి అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- మొత్తం 288 సీట్లలో.. 4 వేల 136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- వీరిలో 2 వేల 086 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు
- 2019 ఎన్నికల కంటే.. ఈసారి అదనంగా 897 మంది అభ్యర్థులు అదనంగా ఉన్నారు.
- ఎప్పుడూ లేని విధంగా ఈసారి.. 150 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నుంచి రెబెల్స్ బరిలో ఉండటం.. అన్ని పార్టీలను ఆందోళనకు గురి చేస్తుంది.
- మొత్తం ఓటర్లు 9 కోట్ల 70 లక్షల 25 వేల 119 మంది
- పురుషులు 5 కోట్ల 22 లక్షల 739 మంది
- మహిళలు 4 కోట్ల 69 లక్షల 96 వేల 279 మంది
- ట్రాన్స్ జెండర్లు 6 వేల 101 మంది
- వికలాంగులు ఓటర్లు 6 లక్షల 41 వేల 425 మంది
- సాయుధ బలగాలకు చెందిన ఓటర్లు ఒక లక్షా 16 వేల 170 మంది
- పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు ఒక లక్షా 186