లక్నో: 2025, జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మొదలైన మహా కుంభమేళా.. 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాళ్లలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయుల కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు పొటెత్తుతున్నారు. కుంభమేళాకు తొలి రోజు 1.5 కోట్ల మంది భక్తులు రాగా.. రెండవ రోజు ఏకంగా 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు.
దాదాపు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఈ కుంభమేళాలో ముఖ్యంగా యువత ఎట్రాక్ట్ చేస్తున్నారు. స్టైలిష్ లుక్‌లో ఉండే యువత పూర్తిగా ఆధ్యాత్మికంలో ముగినిపోయి చూపురులను అబ్బురపరుస్తున్నారు. అలాగే యువ వ్యాపార వేత్తలకు కుంభమేళా ఒక మంచి అవకాశంగా మారింది. ఫేమస్ హస్తకళలు, సాంప్రదాయ వస్తువులను విక్రయించడంతో పాటు స్థానిక రుచికరమైన వంటకాలను అందించే ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి డబ్బు సంపాదిస్తున్నారు యువత.
ALSO READ | కేజ్రీవాల్‌పై పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థికి బిగ్ షాకిచ్చిన ఈసీ
కుంభమేళా యువ ప్యాపారులకు వారి ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి బెస్ట్ చాన్స్‌గా మారడమే కాకుండా.. మార్కెట్‌ను అర్థం చేసుకోవడం.. ఇతర వ్యాపారులతో సంబంధాలను పెంపొందిస్తుంది. అలాగే కుంభమేళాకు ఒక వచ్చిన ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల బృందం.. రుద్రాక్ష బ్రాస్‌లెట్‌లు, ప్రత్యేకమైన టాటూలు, సన్‌గ్లాసెస్‌లు ధరించి సందడి చేయడం ఆకట్టుకుంది. అలాగే.. హర్యానాకు చెందిన ఒక బాడీబిల్డర్ తన కుడి చేయి, సిక్స్-ప్యాక్ అబ్స్‌ను కప్పి ఉంచే అదిరపోయే పచ్చబొట్టుతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
మరో యువకుడు వేసుకున్న భారీ హనుమాన్ టాటూ కుంభమేళాకు వచ్చిన వారిని ఆకట్టుకుంది. స్నేహితులంతా కలిసి వెళ్లేందుకు కూడా కుంభమేళా బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా మారింది. పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకునే వారికి కుంభమేళా బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. స్వామిజీలు, బాబాలు కుంభమేళాలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ధ్యాన సెషన్‌లు, యోగా తరగతులు, ఆధ్యాత్మికత యొక్క వివిధ అంశాలపై ప్రసంగాలను కూడా అందిస్తున్నారు. మొత్తానికి ఈ కుంభమేళాలో కుర్రాళ్ల హవానే కనిపిస్తోంది.