కరీంనగర్ జిల్లాలో..టెన్త్ ఎగ్జామ్స్ కు 38, 017 మంది హాజరు 

  •     ఉమ్మడి జిల్లావ్యాప్తంగా  తొలిరోజు 38,052 మంది రెగ్యులర్​ విద్యార్థులకు 38, 017 మంది హాజరు 

కరీంనగర్, వెలుగు :  టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 75 సెంటర్లలో 12458 మందికి గానూ 12445 మంది తెలుగు ఫస్ట్​ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరుకాగా  13 మంది ఆబ్సెంట్ అయ్యారు. అలాగే ప్రైవేటు విద్యార్థులు 43 మందికి గాను 23 మంది పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్వాడ్​ 26 పరీక్షా కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ 7 సెంటర్లను, డీఈవో 7 సెంటర్లను, స్టేట్ అబ్జర్వర్లు ఆరు సెంటర్లను, అడిషనల్ కలెక్టర్ ఓ కేంద్రాన్ని, జిల్లా కలెక్టర్ రెండు సెంటర్లను తనిఖీ చేశారు. 

పెద్దపల్లి జిల్లాలో 99.9 శాతం హాజరు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో టెన్త్​ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొదటి రోజు 99.9 శాతం మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 45 సెంటర్లు ఏర్పాటు చేయగా 7,725 మంది విద్యార్థులకు గానూ 7,716 మంది విద్యార్థులు హాజరయ్యారు. రంగంపల్లి లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటుచేసిన ఎగ్జామ్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. 

రాజన్నసిరిసిల్ల జిల్లాలో..

సిరిసిల్ల టౌన్, వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్లలో టెన్త్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఈవో ఎ.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. జిల్లాలో 35  పరీక్షా కేంద్రాలలో 6475 విద్యార్థులకు గానూ 6469  మంది విద్యార్థులు హాజరు కాగా, 99.9 శాతం హాజరు నమోదయినట్లు తెలిపారు. వేములవాడలోని జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనురాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జయంతి సందర్శించారు. 

జగిత్యాలలో 99.84 శాతం హాజరు 

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో 99.84 శాతం హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 64  పరీక్షా కేంద్రాల్లో11,394 మంది విద్యార్థులకు 11,376 మంది హాజరయ్యారు. మొదటి రోజు తెలుగు పేపర్-1 పరీక్షకు 18 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారు. అలాగే సప్లమెంటరీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మూడు సెంటర్లలో 37 విద్యార్థులకు గానూ 34 మంది హాజరయ్యారు. కలెక్టర్ యాస్మిన్ బాషా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు సెంటర్లను స్టేట్ అబ్జర్వర్ ఉషారాణి తనిఖీ చేశారు.