హైదరాబాద్​మార్కెట్లోకి క్రెటా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌కారు

హైదరాబాద్​మార్కెట్లోకి  క్రెటా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌కారు

హ్యుండాయ్  క్రెటా ఎలక్ట్రిక్  కారు హైదరాబాద్​ మార్కెట్లోకి వచ్చింది. జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్​ హ్యుండాయ్​ షోరూమ్​లో ​దీనిని  సినీనటి సోనియా గురువారం లాంచ్​చేశారు.   ఒక్కసారి చార్జ్​ చేస్తే ఇది 473 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. గంట సేపట్లో 80 శాతం చార్జింగ్ (డీసీ)​ పూర్తవుతుంది.  ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్స్​, అల్లాయ్ వీల్స్,  టచ్‌‌‌‌‌‌‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్, డిజిటల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.