ఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌ మొత్తం ఒకేచోట...

ఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌ మొత్తం ఒకేచోట...
  •     డ్యాష్‌‌‌‌బోర్డు అప్లికేషన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు సన్నాహాలు
  •     సీఎండీ కర్నాటి వరుణ్‌‌‌‌రెడ్డి వెల్లడి

హనుమకొండ, వెలుగు : టీజీఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ సమాచారం మొత్తాన్ని ఒకే చోట అందించేందుకు డ్యాష్‌‌‌‌బోర్డు అప్లికేషన్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌‌‌‌రెడ్డి చెప్పారు. యుటిలిటీ ఆపరేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌పై ఫ్లూయంట్‌‌‌‌ గ్రిడ్‌‌‌‌ కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్‌‌‌‌ భవన్‌‌‌‌లో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ టీజీఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ పరిధిలో బిల్లింగ్‌‌‌‌, కలెక్షన్‌‌‌‌, అంతరాయాలు

ఫిర్యాదుల వివరాలకు సంబంధించి ఒకే చోట పూర్తి సమాచారం తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని ద్వారా వర్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, అవుట్‌‌‌‌ ఏజ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సిస్టం, డిమాండ్‌‌‌‌ సైడ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, వినియోగదారుల పోర్టల్, సిటిజన్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, మీటర్‌‌‌‌ డేటా, అస్సెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ వంటి వివరాలు తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. ఇంటరాక్టివ్‌‌‌‌ వాయిస్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ముందుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బి.అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌, టి.సదర్‌‌‌‌లాల్‌‌‌‌, వి.మోహన్‌‌‌‌రావు, వి.తిరుపతిరెడ్డి, సీజీఎంలు కె.తిరుమల్‌‌‌‌రావు, టి.మధుసూదన్‌‌‌‌, కె.కిషన్‌‌‌‌, రాజుచౌహాన్‌‌‌‌ పాల్గొన్నారు.