మైనార్టీల మొగ్గు ఎటుంటే అటే..!

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాం గ్రెస్, బీజే పీ అభ్యర్థులు బీసీ, మైనార్టీ ఓట్లపై గురిపెట్టారు. మరీ ముఖ్యం గా గంపగుత్తగా ఓట్లు పడే అవకాశం ఉన్న మైనార్టీలను ఆకట్టుకునేందుకు ప్లాన్‍ చేస్తున్నారు. స్టేట్ లో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంతర్వాత ఆ స్థాయిలో మైనార్టీ ఓట్లు ఉన్న స్థానం సికిం ద్రాబాదే. ఇక్కడ అభ్యర్థుల విజయాన్నిడిసైడ్‍ చేసేదీ వారే. గతంలో ఇక్కడ కాం గ్రెస్,బీజే పీల మధ్యే పోటీ ఉండేది. మైనార్టీలు ఎక్కు-వగా కాం గ్రెస్ వైపు మొగ్గు చూపేవారు. 2014ఎన్నికల్లో మాత్రం మైనార్టీ ఓట్లు భారీగా చీలాయి.అది బీజే పీకి బాగా కలిసి వచ్చిం ది. ఆ ఎన్నికల్లోఎంఐఎం, టీఆర్ఎస్ అభ్యర్థులకు చెరో లక్షా 50వేల ఓట్లు వచ్చాయి. దీనికితోడు వైఎస్ఆర్ సీపీముస్లింకు టిక్కె ట్ ఇవ్వటంతో ఆపార్టీ అభ్యర్థిసైతం ఏకంగా 45 వేల ఓట్లు దక్కించుకున్నారు.టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లలో చాలా వరకు మై-నార్టీలే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఈసారిమైనార్టీల ఓట్లు చీలకుం డా గుం పగుత్తగా కొల్లగొ-డితే గెలుపు తమదేనన్న భావన టీఆర్ఎస్, కాం గ్రె-స్ లో ఉంది. బీజే పీకి మైనార్టీల మద్దతు తక్కువగాఉంటుం ది కాబట్టి ఆ పార్టీ పెద్దగా ఈ ఓట్లపై దృష్టిపెడుతుం దా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

చీలితే లాభం కమలానికే

ఇక్కడ మైనార్టీ ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నప్పటి కీబీజే పీ నాలుగుసార్లు విజయం సాధించిం ది. సికిం -ద్రాబాద్ లోని అంబర్ పేట, ముషీరాబాద్, ఖైరతా-బాద్ లాంటి నియోజకవర్గాల్లో బీజే పీకి మంచిపట్టు ఉంది. బీసీ ఓటర్లు సైతం ఆ పార్టీకి అండగాఉన్నారు. ముఖ్యం గా యాదవ సామాజిక వర్గంఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. గతంలోకాం గ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్, బీజే పీఅభ్యర్థి బండారు దత్తాత్రేయ ఇద్దరు యాదవసామాజిక వర్గాని కి చెం దిన వారే. ఈసారిబండారు దత్తాత్రేయకు సీటు దక్కకపోవటంతోఆయనకు మద్దతుగా నిలిచిన యాదవుల ఓట్లుకిషన్ రెడ్డి వైపు మొగ్గుచూపుతారా అన్నది వేచిచూడాలి. అయితే కిషన్ రెడ్డి గెలుపునకు కృషి చే-స్తానని దత్తాత్రేయ ప్రకటించారు. దీం తో బీజే పీకిఓటు బ్యాంకుపై ఆ పార్టీ పెద్దగా ఆందోళనచెం దటం లేదు. మైనార్టీల ఓట్లు కాం గ్రెస్,టీఆర్ఎస్ ల మధ్య చీలుతాయని బీజే పీ అంచనావేస్తోంది. ఎప్పుడూ కాం గ్రెస్ వైపు ఉండే ముస్లిం-లలో ఇప్పుడు చాలా చీలిక వచ్చిం ది. కాం గ్రెస్ నుకాదని కారు వైపు చూస్తున్నారు. కేసీఆర్ సర్కార్మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటుఎంఐఎంతో దోస్తానా కట్టటంతో అసెంబ్లీ ఎన్ని-కల్లో ఓటర్లు టీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. కానీఇది మోడీ వర్సెస్ రాహుల్ ఫైట్ అని కాం గ్రెస్,బీజే పీ నేతలు ప్రచారం చేస్తుం డటంతో పాటుటీఆర్ఎస్ గెలిస్తే కేం ద్రంలో బీజే పీకి మద్దతిచ్చేఅవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీం తోమైనార్టీలు ఎటువైపు నిలుస్తారో ఫలితాలు వస్తేగానీ తెలియని పరిస్థితి.

హస్తం , కారు మధ్యే పోటీ

మైనార్టీలు కాం గ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంక్. వారి మద్దతు భారీగా ఉండటంతో 2004,2009 ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఈజీగా విజయం సాధిం చారు. కానీ2014లో పూర్తిగా మైనార్టీల ఓట్లు దూరం కావటంతో అంజన్ కుమార్ కేవలం లక్షా 86 వేలఓట్లకు పరిమితమయ్యారు. దాదాపు మూడు లక్షల వరకు మైనార్టీ ఓట్లు చీలటంతో కాం గ్రెస్ అభ్య-ర్థికి ఊహిం చని దెబ్బపడిం ది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేయటం లేదు. అటు ఎంఐఎంకూడా టీఆర్ఎస్ కు ఫ్రెండ్లీ పార్టీ. గత ఎన్నికల్లో ఎంఐఎం, వైఎస్ఆర్ సీపీలకు వచ్చిన ఓట్లు ఈసారిఏ పార్టీకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. ఈసారి సికిం ద్రాబాద్ నియోజకవర్గంలోచాలా వరకు సమీకరణాలు మారాయి. టీఆర్ఎస్ బలం పుం జుకుం ది. సనత్ నగర్, ఖైరతాబాద్,జూబ్లీహిల్స్, సికిం ద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్, నాం పల్లి అసెంబ్లీ స్థానా ల్లో ఒక్క నాం పల్లిమినహా అన్ని సీట్లు గెలుచుకుం ది. మైనార్టీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అండగానిలిచారు. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మైనార్టీల ఓటర్లను ఏకం చేస్తే విజయంసులభమవుతుం దని కారు భావిస్తోంది. టీఆర్ఎస్ పరోక్షంగా బీజే పీకి మద్దతిస్తుం దని ఆ పార్టీకిఓటేస్తే బీజే పీకీ ఓటు వేసినట్లేనని ఇప్పటి కే కాం గ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు టీఆర్ఎస్సైతం మైనార్టీ ఓట్లు చేజారకుం డా జాగ్రత్త పడుతోం ది. దీం తో మైనార్టీ ఓట్ల కోసం టీఆర్ఎస్,కాం గ్రెస్ లు ప్రత్యేక వ్యూహరచనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.