రామ్ లీలా మైదానం ఆలయ స్థలమే: అఖిలపక్ష నాయకులు

రామ్ లీలా మైదానం ఆలయ స్థలమే: అఖిలపక్ష నాయకులు

మెహిదీపట్నం, వెలుగు: లంగర్ హౌస్ సంగం రామ్ లీలా మైదానంలో గురువారం ఫెన్సింగ్​ఏర్పాటు చేసేందుకు వచ్చిన టూరిజం శాఖ అధికారులను స్థానిక అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. 500 ఏండ్లుగా మైదానంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని,  సదరు స్థలం రామాలయానికి చెందినదని ఆలయ మఠాధిపతి రాహుల్ దాస్ బాబా, స్థానిక నాయకులు చెరుకూర ఉదయ్ కుమార్, పూర్ణచందర్రావు, వినేశ్​సింగ్, గోవింద్, నాగేంద్ర ప్రకాశ్​రెడ్డి, చంటిబాబు, రఘుపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యం రెడ్డి, లింగారెడ్డి, మాతాంగి రమేష్, ఆకుల చంద్రశేఖర్ చెప్పారు. 

అనంతరం గోల్కొండ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. రామ్​లీలా మైదానంలో ఫెన్సింగ్​ఏర్పాటు చేయొద్దని కోరారు. విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ వారికి మద్దతు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. టూరిజం అధికారులతో మాట్లాడారు. టూరిజం శాఖ కమిషనర్ తో ఫోన్​లో మాట్లాడి, సదరు స్థలం రామాలయానికి చెందినదని తెలిపారు. సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు.