మల్కాజిగిరి నీదా..నాదా?

మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుం ది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలో నిలిచారు. అధికార పార్టీ ఈ సీటును  సిట్టింగ్ స్థానంగా విస్తూ గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుం ది. ముఖ్యం గా ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన లీడర్ రేవంత్ రెడ్డి  డటంతో.. మరిం త పట్టుదలతో గట్టి పోటీ ఇచ్చే కార్యచరణతో రెడీగా ఉంది. ఓ వైపు గెలుపును మరింత సులువుగా చేసుకునేం దుకు ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తూనే, మరో వైపు క్షేత్రస్థాయిలో బలమైనవర్గాలను, సెకండ్ క్యా డర్ నేతలను కూడగట్టుకుని ఎన్నికల వ్యూహంలో ముం దంజలో ఉంది.2014 ఎన్ని కల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మల్లా రెడ్డి పోటీ చేయగా… ఆయనపై టీఅర్ఎస్ నుండి మైనంపల్లి హనుమంతరావు పోటీపడి 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం టీఆర్ఎస్ లో మల్లా రెడ్డి చేరిపోవడంతో అధికార పార్టీ ఖాతాలో మరో ఎంపీ స్థానం పడిం ది. దీనితో అప్పటివరకు బలమైన టీడీపీ క్యా డర్ అంతా టీఆర్ఎస్ లో చేరిపోయిం ది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ మల్లా రెడ్డి పోటీ చేసి.. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మ రెడ్డిపై 50 వేల ఓట్ల మెజారిటీతో సునాయాస గెలుపుతో అధిష్ఠా నం మెప్పించి మంత్రి పదవి దక్కిం చుకున్నారు. ఈ స్థానం నుండి ఈసారి తన అల్లుడిని ఎంపీగా పోటీకి దిం పుతున్నారు.

బలమైన టీడీపీ క్యా డర్..కీలకంగా మారిన సెటిలర్లు

ఈ లోక్ సభ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి బలమైన క్యా డర్ ఉంది. గతంలోజరిగిన అసెంబ్లీ , ఎంపీ ఎన్ని కలలో అభ్యర్టుల గెలుపోటములను నిర్దేశించగా..కీలమైన సెటిలర్ల ఓట్లను దక్కిం చుకున్న వారే గెలిచారు. అయితే 2009, 2014 లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు మంచి పట్టు ఉండగా…తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యక ర్తలు పెద్ద ఎత్తున గులాబీ వైపు మొగ్గు చూపారు. దీతో పార్టీలో గెలిచి న అభ్యర్థులు పార్టీ మారడంతో ఈ సెగ్మెంట్ ను టీఆర్ఎస్ చేజిక్కిం చుకుంది.

స్థానిక సమస్యలే ప్రధాన అజెండా

ఈ ఎన్ని కల్లో తమ అభ్యర్థిని గెలిపిం చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ స్థానిక సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రచారం చేస్తూ జనాల్లోకి వెళ్తోంది.ముఖ్యం గా కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఓటర్ల ప్రధాన సమస్యలైన రోడ్ల విస్తరణ, ట్రాఫిక్, తాగునీటి కొరత, పెండిం గ్ నీటి బకాయిలు, డిఫెన్స్ భూములకు అనుమతుల నిరాకరణ, డిఫెన్స్ పరిధిలో ఉన్న భూముల వ్యవహారం వంటివే ప్రధాన ప్రచారాస్ర్తాలుగా ముం దుకు సాగుతోంది.7 అసెంబ్లీ స్థానాల్లో వరుస సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంది.మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని దక్కించుకునేం దుకు కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. అభ్యర్థి ఎంపిక నుంచి పార్టీ ప్రచారం వరకు ప్లాన్డ్ గా వ్యవహరిస్తోంది. దీనికి దీటుగా అధికార పార్టీ సైతం పావులు కదుపుతోం ది. గత ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మల్లా రెడ్డి గెలుచుకున్నారు. తర్వాతి కాలంలో ఆయన టీఆర్‍ఎస్ లో చేరారు. ఈ స్థానాన్ని తమవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్.. ఆ పార్టీ రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బరిలో నిలిపిం ది. ఈ ఎన్ని కలను సవాల్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి… భావసారూప్యత కలిగిన వ్యక్తులను, వివిధ పార్టీల నాయకులను, కాంగ్రెస్ సీనియర్ , స్థానిక నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. అభ్యర్థి ప్రకటన పూర్తి కాగానే సెగ్మెంట్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బిజీగా మారిపోయారు.

అవగాహన పెంచుకుంటూ.. అధికార పక్షాన్ని ఎండగడుతూ..

సెగ్మెంట్ లోని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై, స్థానిక అంశాలపై అవగాహన పెంచుకున్న రేవంత్ రెడ్డి, అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్ , ఉప్పల్ , కుత్బుల్లా పూర్ , మేడ్చల్ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో భేటీ అవుతూనే స్థానిక సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, ఎంపీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం అంతగా ఉండబోదనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్ లో బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. మాజీ కార్పోరేటర్లు, డివిజన్ స్థాయి నేతలు, కార్యకర్తలను ఉత్సాహపరిచేలా, ఎన్ని కల ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. టికెట్ ఖరారు కాగానే తొలుత, ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మద్దతు పొందారు. తర్వాత సెగ్మెంట్ లో ఎంపీ ఎన్నికల కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జిలను నియమించుకుని ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్‍ కోదండరాం , ఉద్యమ నేత గద్దర్, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తదితరులను కలుస్తూ బలంపెంచుకుంటున్నారు.