నాంపల్లి (చండూరు) వెలుగు: రెవెన్యూ డివిజన్ కోసం చేస్తున్న దీక్షల ను అవమానిస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మను అఖిలపక్ష నాయకులు దహనం చేశారు. నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. రూ.1000 ఇస్తే ఎవరైనా కూర్చుంటారని బుధవారం ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూల వెంకటయ్య, నాంపల్లి సతీశ్, అంగిరేకుల పాండు, పానుగంటి మహేశ్, కాంగ్రెస్ నాయకులు చాంద్ పాషా, గాదపాక వేలాద్రి, సంజీవ, సీపీఐ ఊరి పక్క యాదయ్య, ఎమ్మార్పీఎస్ నుంచి శాంతికుమార్, టీడీపీ నుంచి పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.