సీతారామ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి : రైతు సంఘాల నాయకులు

సీతారామ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి : రైతు సంఘాల నాయకులు

కామేపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి కామేపల్లి మండలానికి సాగు నీరు అందించాలని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కామేపల్లి సీపీఎం పార్టీ కార్యాలయంలో సీపీఐ నేత ఏపూరి లతాదేవి అధ్యక్షతన అఖిల పక్షాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడారు. రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం వల్ల ఇల్లెందు నియోజకవర్గం ఏడారిగా మారుతోందన్నారు.

సీతారామ ప్రాజెక్టు 2016లో శంకుస్థాపన చేసినప్పటికీ ఆ పనులు పూర్తి చేయకపోవడం, డిజైన్ మార్చడం ద్వారా ఈ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. వెంటనే సీతారామ కాలువలను ఇల్లెందు నియోజకవర్గంలో అన్ని మండలాలకు తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రై సంఘం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గి కృష్ణ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు జర్పుల రామారావు, న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల నాయకులు సింగం వెంకన్న, రంగయ్య, సీపీఎం మండల మాజీ కార్యదర్శి శ్రీను పాల్గొన్నారు.