
రేగోడ్, వెలుగు : రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన చర్చా వేదికలో మండల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు యువకులు, విద్యావేత్తలు, టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రేగోడ్ మండలం చివరన ఉండటంతో జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువైందన్నారు. దీంతో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. జడ్పీటీసీ యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్, పీసీసీ మెంబర్కిషన్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు సర్దార్, జిల్లా సర్పంచుల ఫోరం బాధ్యులు రమేశ్, ఎంపీటీసీ నర్సింలు, సర్పంచులు రవీందర్, నరసింహులు, మండల యువజన సంఘాల బాధ్యులు నాగప్పగారి సుమన్, జగదీశ్, మహేశ్ పాల్గొన్నారు.