కెనాల్ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి..కోటగిరిలో అఖిలపక్షం నాయకుల ధర్నా

కెనాల్ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి..కోటగిరిలో అఖిలపక్షం నాయకుల ధర్నా

కోటగిరి, వెలుగు: కోటగిరి మండలంలో కెనాల్ కబ్జాకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆక్రమణదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఇరిగేషన్‌ డీఈ ఆఫీసులో, తహసీల్దార్‌‌కు వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో బస్టాండ్ పక్కనే దర్జాగా కెనాల్ ఆక్రమణలు జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కెనాల్ బౌండరీల కబ్జాపై ఉద్యమానికి సిద్ధమయ్యామన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల లీడర్లు ఆనంద్, పోచీరం, సాయి, నల్ల గంగాధర్, గుడాల రాములు, రాజు, బేగరి రాములు, పాల గంగాధర్‌‌, రైతులు ఉమాకాంత్ దేశాయ్, లింగారాం, నాగరాజు, కాయపల్లి సాయిలు పాల్గొన్నారు.