చేవెళ్లలో హైవే పనులు ప్రారంభించాలని ధర్నా : అఖిల పక్షం లీడర్లు

చేవెళ్లలో హైవే పనులు ప్రారంభించాలని ధర్నా : అఖిల పక్షం లీడర్లు

చేవెళ్ల/పరిగి, వెలుగు:  హైదరాబాద్-– బీజాపూర్ నేషనల్​హైవే విస్తరణ పనులు ప్రారంభించాలని మంగళవారం చేవెళ్లలో అఖిల పక్షం లీడర్లు రెండు గంటల పాటు ధర్నా చేశారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీఆర్ఎస్ స్టేట్​లీడర్​కార్తీక్​రెడ్డి, జిల్లా లీడర్లు దేశమోళ్ల ఆంజనేయులు, మాజీ ఎంపీపీ బాల్​రాజ్, సీపీఐ, సీపీఎం లీడర్లు రామస్వామి, ప్రభులింగం, దేవేందర్​ఆయా గ్రామాల సర్పంచ్​లు పాల్గొని మాట్లాడారు. ఆలూరు ప్రమాదంలో చనిపోయిన, గాయపడ్డవారికి భారీ పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలన్నారు. 

పీసీసీ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షు ప్రభాకర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంత్​రెడ్డి, వైభవ్​రెడ్డిఉన్నారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ లీడర్​శుభప్రద్​ పటేల్ హెచ్చరించారు. ఆలూర్ గ్రామ ప్రజలు, అఖిలపక్ష లీడర్లతో కలిసి ఆలూర్ గేట్ నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర తీశారు. 

మీర్జాగూడ సమీపంలో ఆర్టీఓ చంద్రకళ, ఏసీపీ కిషన్ నిరసనకారులను ఆపి చర్చించారు. మృతులకు ఎక్స్​గ్రేషియా కింద రూ.7 లక్షలు, గాయపడ్డవారికి వైద్య ఖర్చులు భరిస్తూ ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్--బీజాపూర్ రోడ్డు పక్కన చెట్లను కొట్టివేస్తున్నారని గ్రీన్ ట్రిబ్యునల్​లో కేసు వేసిన చెన్నైకి చెందిన ఓ ఎన్డీఓకు చెందిన తేజపై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఏస్ రత్నం, బీజేపీ లీడర్లు వైభవ్​రెడ్డి, అనంతరెడ్డి, కృష్ణగౌడ్, దేవుని శర్వలింగం చేవెళ్ల పీఎస్​లో ఫిర్యాదు చేశారు.
 
ఏడాదిలోగా పూర్తి చేయిస్తాం: చేవెళ్ల, పరిగి ఎమ్మెల్యేలు 

హైవే విస్తరణ పనులు గత నెల 28న ప్రారంభమయ్యాయని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్​రెడ్డి తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో, మన్నెగూడలో వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పనులు ముందుకు సాగలేదన్నారు. 

అన్ని కేసులు క్లియర్ చేసుకొని ఏడాదిలో రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రాములు, కృష్ణ, సుజాత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదేశాల మేరకు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్ రూ.20 వేల చొప్పున అంత్యక్రియల కోసం అందజేశారు.