రేపటి నుంచి (31 జనవరి) బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంటు ముందుకు 16 బిల్లులు..?

రేపటి నుంచి (31 జనవరి) బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంటు ముందుకు 16 బిల్లులు..?

బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (31 జనవరి 2025) నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.  ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్ మురుగన్ హాజరయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేష్,  కె.సురేష్, గౌరవ్ గొగోయ్.. టీఎంసీ నుంచి సుదీప్ బంద్యోపధ్యాయ్, డెరెక్ ఓబ్రయాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలకు  సహకరించాలని విపక్ష సభ్యులను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. 

బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4 న ముగియనున్నాయి. ఫిబ్రవరి 1 న ఆర్థి క మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.  

బడ్జెట్ సమావేశాలు ప్రారంభ రోజైన జనవరి 31న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేయనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 10 వరకు విరామం ఇవ్వనున్నారు. 

2025-26 బడ్జెట్ సమావేశాలలో పార్లమెంటు ముందుకు 16 ముఖ్యమైన బిల్లులు రానున్నట్లు సమాచారం. వక్ఫ్ సవరణ బిల్లు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ బిల్లు, ఆర్థిక బిల్లు 2025, ఇమ్మిగ్రేషన్ 2025 బిల్లులతో పాటు మరికొన్ని  బిల్లులను చేర్చింది కేంద్రం.

బడ్జెట్ సమావేశాల కోసం ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తు్న్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం మొదలైన అంశాలపై విపక్షాలు పట్టు బట్టే అవకాశం ఉంది.