కులగణన చేపట్టాలంటూ ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్

కులగణన చేపట్టాలంటూ  ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్
  • కులగణన చేపట్టాలంటూ నేడు ఆల్ పార్టీ మీటింగ్
  • పలు పార్టీల నేతలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెంటనే సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనే డిమాండ్​తో గురువారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మీటింగ్​కు రావాలని ప్రభుత్వ సలహాదారు కేకే, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్, బీఆర్ ఎస్ నేతలు పొన్నాల, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీఎస్పీ నేతలను బుధవారం ఆహ్వానించారు. 

ఈ మీటింగ్​కు సామాజిక ఉద్యమ సంస్థలు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలను ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తాము గత ఆరు నెలలుగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నేతలు జాజుల, బాలగోని బాలరాజ్ గౌడ్ తెలిపారు.