- ప్రజారోగ్యం బాగుంటే ఆరోగ్య శ్రీ., ఆయుష్మాన్ భారత్ అవసరం లేదు: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
హైదరాబాద్: ప్రజల ఆరోగ్యం బాగుంటే ఆరోగ్య శ్రీ,, ఆయుష్మాన్ భారత్ పథకాలు అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహించడానికే ఆరోగ్య శ్రీ., ఆయుష్మాన్ భారత్ పథకాలు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపంలో జరుగుతున్న ప్రజా ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యే డి.శ్రీధరబాబు,హెచ్ఆర్ డిఎ (HRDA),ఐఏంఎ (IMA), టీ-జెయుడిఎ (T-JUDA), టీ-ఎస్ఆర్డిఎ (T-SRDA), టిజిడిఎ (TGDA), టిడిఎఫ్ (TDF)., కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్, నర్సింగ్ అసోసియేషన్, పారామెబొకల్ అసోసియేషన్ వైద్య సంఘాల పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆరోగ్య తెలంగాణలా మార్చాలని అన్ని అంశాలను చర్చించడానికి ఈ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రాలు బాగుచేయకుండా ప్రజలకు వైద్యం అందదన్నారు. ప్రజా ఆరోగ్య పరి రక్షణ కార్యక్రమాన్ని 9 సంఘాలు కలసి నిర్వహిస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆరోగ్యం అభివృద్ధి చెందినప్పుడే ప్రజలకు మంచి వైద్యం అందుతుందన్నారు. కరోనా టైం లో గాంధీ హాస్పిటల్ ముఖ్య పాత్ర పోషించింది, ఎంతో మంది వైద్య సిబంది ప్రాణలు పణంగా పెట్టి వైద్యం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజల చేత గెలిచినా ప్రజా ప్రతి నిధులు అందరూ ప్రభుత్వ దావఖనలో వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రాథమిక వైద్య కేంద్రాలు బాగుచేయకుండా ప్రజలకు వైద్యం అందదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ లో 680 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సి)లు వున్నాయని వీటిలో డాక్టర్లను నియమించాలన్నారు. 4 కోట్ల జనం ఉన్న తెలంగాణ లో 30 వేల మంది కి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సి) చొప్పున 1100 పీహెచ్ సిలు ఉండాలన్నారు. ఎంతో చరిత్ర ఉన్న ఉస్మానియా బిల్డింగ్ సమస్య పారష్కరించాలన్నారు. డాక్టర్లపై దాడులను ఖండిస్తున్నానని తెలిపారు. ఎస్పీ ఎఫ్ భద్రత కల్పించాలపొ. నకిలీ డాక్టర్ల విషయంలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయలు, డాక్టర్ల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే ప్రజలకు మంచి వైద్యం అందుతుంన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యక్తి గత స్కీమ్ లు పెట్టడం కంటే ఫండ్స్ రూపంలో ఇస్తే బాగుంటదని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
పోషకాహారం అందించే ఏజెన్సీలపై సర్కార్ కీలక నిర్ణయం
కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను
దేశ భద్రతపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం