నిండుకుండలా ప్రాజెక్టులు

  • ప్రాజెక్టుల్లోని భారీగా వరదనీరు 
  • గేట్లు ఓపెన్​ చేస్తున్న ఆఫీసర్లు 
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ 

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల ఏకధాటి వర్షానికి  ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో  రాష్ట్రంలోని అన్నీ ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి.  ఆయా ప్రాజెక్టుల్లో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు వరదనీటిని ప్రాజెక్టుల నుంచి గేట్లు ఓపెన్​చేసి, దిగువకు విడుదల చేస్తున్నారు. 

సాగర్​ నుంచి 5,06,248 క్యూసెక్కుల నీటి విడుదల 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు  26 క్రస్ట్ గేట్లు  ఓపెన్​ చేశారు. 26 గేట్లు ద్వారా 5,06,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తి నీటి మట్టం 590  అడుగులు కాగా,  ప్రస్తుతం ప్రాజెక్టు 587.20 అడుగుల్లో ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం - 312.50 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం- 305.62 టీఎంసీలు చేరింది. ఇన్ ఫ్లో - 5,33,157 క్యూసెక్కులు కాగా..  ఔట్ ఫ్లో - 5,41,435 క్యూసెక్కులుగా నమోదయింది. 

ఎస్సారెస్పీ 8 గేట్లు ఓపెన్​

ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో భారీగా పెరిగింది.  దీంతో  ప్రాజెక్టు 8 గేట్లను  ఓపెన్ చేసి, గోదావరిలోకి నీటిని విడుదల చేశారు.   ప్రాజెక్టులో  ఇన్ జేన్ ఫ్లో 1.96,767 క్యూసెల్కు లుండగా, ఔట్​ ఫ్లో 34853 క్యూసెల్కులుగా నమోదయింది.

కడెం ప్రాజెక్టు ఫుల్​గేట్లు ఓపెన్​ 

కడెం ప్రాజెక్టు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది.  దీంతో అధికారులు కడెం ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను ఎత్తి, దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 694.300 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 194039 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో   249054 క్యూసెక్కులకు చేరింది.