
బెంగళూరు: తొలి మ్యాచ్‌లో ఆఖరి బాల్‌కు ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ డబ్ల్యూపీఎల్‌లో బోణీ చేసింది. బౌలింగ్‌లో రాధా యాదవ్ (4/20), మరిజేన్ కాప్ (3/5).. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ (43 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్), మెగ్ లానింగ్ (43 బాల్స్‌లో 6 ఫోర్లతో 51) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన యూపీ 20 ఓవర్లలో 119/9 స్కోరుకే పరిమితం అయింది. కాప్, రాధా యాదవ్ దెబ్బకు శ్వేత సెహ్రావత్ (45) తప్ప మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. అనంతరం ఓపెనర్లు లానింగ్, షెఫాలీ ఫిఫ్టీలతో దంచడంతో ఢిల్లీ 14.3 ఓవర్లలోనే 123/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.