ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ సిద్ధమైంది. ఇయ్యాళ ఉదయం 9.45 గంటలకు అతిథుల ఆహ్వానం, పరిచయ కార్యక్రమం, రేజర్ షో, మా తెలుగు తల్లికి.. గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉపన్యసించనున్నారు. అనంతరం ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలు అతిథులు, ప్రముఖులు హాజరు కానున్నారు. వారిలో నాఫ్ సీఈఓ సుమిత్ బిదాని, భారత్ ఎఫ్‌ఐహెచ్ లిమిటెడ్ కంట్రీ హెడ్ అండ్ ఎండీ జోష్ ఫాల్గర్, టొరే ఇండస్ట్రీస్(ఇండియా)ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసహీరో హమగుచి, కియా ఇండియా నుంచి కబ్ డోంగి లీ, ది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతిరెడ్డి, శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, సెంచురీ ఫ్లైబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజంకా, టెస్లా ఇంక్ కో ఫౌండర్ అండ్ మాజీ సీఈఓ మార్టిన్ ఎబర్‌హార్డ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ ఉన్నారు.
వీరితో పాటు జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి.ఎం.రావు, సయింట్ ఫౌండర్ చైర్మన్ బీవీ మోహన్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్లా, దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా, రెనూ పవర్ సీఎండీ సుమంత్ సిన్హా, ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్ ఒబెరాయ్, సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్, అదాని పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదాని, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కె.ఎం.బిర్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీఎండీ ముఖేష్ అంబాని కూడా సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైన ఎంఓయూ ఈవెంట్ ప్రముఖుల ప్రసంగం తర్వాత ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరి కీలక ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ప్రముఖుల సన్మాన కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత తర్వాత ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది.
4 ఆడిటోరియాల్లో సెషన్స్
మధ్యాహ్నం 3 గంటల నుంచి నాలుగు ఆడిటోరియాల్లో వివిధ విభాగాలకు సంబంధించిన సెషన్స్ జరగనున్నాయి. ఆడిటోరియం 1లో ఐటీ, 2లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 3లో రెనెవబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, 4లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్ కంట్రీ సెషన్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆడిటోరియం 1లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, 2లో స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, 3లో హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్‌మెంట్, 4లో ది నెదర్లాండ్స్ కంట్రీ సెషన్ ఉంటుంది.
సాయంత్రం 5 గంటలకు ఆడిటోరియం 1లో ఎల్రక్టానిక్స్, 2లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, 3లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, 4లో ట్రాన్స్‌ఫర్మేటివ్ ఫుడ్ సిస్టమ్స్‌పై ప్రత్యేక హైలెవెల్ సెషన్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కూచిపూడి కళా ప్రదర్శన, 8 గంటలకు డ్రోన్ షోతో తొలిరోజు సదస్సు ముగుస్తుంది.