చంద్రయాన్ 3 చంద్ర మిషన్ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. అంతరిక్షంలో అద్భుతం ఘట్టం కోసం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. చంద్రయాన్ 3 చివరి దశ విన్యాసాలను ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయక్ పరిశీలించారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ విజయవంతం అయితే సాంకేతిక రంగంలో భారత్ ఇస్రో మరో ముఖ్యమైన మైలురాని చేరుకుంటుంది.
మరోవైపు చంద్రునిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం దేశం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను విశ్లేషించేందుకు వ్యోమగాములు రాకేష్ శర్మ, సునీత విలియమ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. "చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండింగ్ అవుతుందని నేను గర్వంగా చెప్పగలను" అని రాకేష్ శర్మ అన్నారు.
చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని దేశ్యాప్తంగా పూజలు నిర్వహిస్తుండగా.. ప్రపంచం మొత్తం సాయంత్రం జరిగే అద్భుతాన్ని తిలకించేందేకు ఎదురుచూస్తున్నారు. చంద్రయాన్ 3 కి అమెరికా, యూరోపియన్ స్పేస్ సెంటర్లు అండగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
ఎలాగైనా చంద్రయాన్ 3ను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ అయిన శాటిలైట్ లేదు.. చంద్రయాన్ 3 మాత్రమే.. అత్యంత సమీపంలోకి వెళ్లింది.. సాఫ్ట్ ల్యాండింగ్ కు వంద శాతం అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇండియానే స్పేస్ రీసెర్చ్ ఇస్రోకు.. సాంకేతికంగానే కాకుండా.. డేటా పరంగా తమ వంతు సహకారం అందిస్తున్నాయి నాసా, యూరోపిన్ స్పేస్ ఏజెన్సీలు.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
All set to initiate the Automatic Landing Sequence (ALS).
Awaiting the arrival of Lander Module (LM) at the designated point, around 17:44 Hrs. IST.
Upon receiving the ALS command, the LM activates the throttleable engines for powered descent.
The… pic.twitter.com/x59DskcKUV