టీచర్లందరికీ సమన్యాయం చేయాలె

టీచర్లందరికీ సమన్యాయం చేయాలె

ముషీరాబాద్, వెలుగు: స్పౌజ్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్​లో ప్రత్యేకమైన పది పాయింట్లను రద్దుచేసి కౌన్సె లింగ్ నిర్వహించాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ నిర్వహించాలని కోరింది. ఈ మేరకు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పోకల శేఖర్, సక్కుబాయి మాట్లాడుతూ.. 30 వేల మంది స్పౌజ్ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన పాయింట్లు కేటాయించడం వల్ల నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 

వ్యక్తిగత వాహనాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రత్యేకమైన పాయింట్లు ఎవరికీ ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ లో స్పౌజ్, నాన్ స్పౌజ్ లకు ఒకే విధమైన పాయింట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కృష్ణరాణి, శ్రీకాంత్,  రామచంద్ర రెడ్డి, మధుసూదన్, మహేశ్, రూపా రాణి,  పద్మా రెడ్డి పాల్గొన్నారు.