Champions Trophy 2025: ప్రైజ్ మనీ వివరాలు వెల్లడి.. ఏ జట్టు ఎంత గెలుచుకుందంటే..?

Champions Trophy 2025: ప్రైజ్ మనీ వివరాలు వెల్లడి.. ఏ జట్టు ఎంత గెలుచుకుందంటే..?

20 రోజులుగా అభిమానులను అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆదివారం(మార్చి 9) ముగిసింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్ కు చేరుకోగా.. ఆతిధ్య పాకిస్థాన్ తో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఒక్క విజయం లేకుండానే టోర్నీ ముగించింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక విజయం  సాధించి 3 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో ఏ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభించిందో ఇప్పుడు చూద్దాం. 

టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియాకు $2.24 మిలియన్లు అంటే భారత కరెన్సీలో రూ. 19.45 కోట్లు లభించాయి. ఈ మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, కోహ్లీకి ఇచ్చే జీతం కంటే  తక్కువ కావడం విశేషం. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు $1.12 మిలియన్లు (9.72 కోట్లు) ప్రైజ్ మనీగా అందుకుంటుంది. సెమీ ఫైనలిస్టులైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు చెరో 560,000 డాలర్లు (రూ. 4.86 కోట్లు) అందుకోనున్నాయి.

ALSO READ | WTC Final 2025: WTC ఫైనల్‌కు అర్హత సాధించని ఇండియా.. ఇంగ్లాండ్‌కు రూ.45 కోట్లు నష్టం

వరుసగా ఐదు, ఆరవ స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు చెరో 350,000 డాలర్లు (రూ. 3.04 కోట్లు) దక్కాయి. ఏడు, ఎనిమిదవ స్థానంలో నిలిచిన పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఒక్కొక్కటి 140,000 డాలర్లు (రూ. 1.21 కోట్లు) అందుకోనున్నాయి. గ్రూప్ దశలో ప్రతి విజయానికి $34,000 (29.5 లక్షలు).. టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టు $125,000 (1.08 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ప్రైజ్ మనీ $6.9 మిలియన్లు (59.9 కోట్లు). 2017  లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కంటే 53 శాతం ఎక్కువ.