కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నారా.. అదిరిపోయే ఫీచర్స్ ఉన్న కొత్త మోడల్స్ పై ఓ లుక్కేయండి..

కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నారా.. అదిరిపోయే ఫీచర్స్ ఉన్న కొత్త మోడల్స్ పై ఓ లుక్కేయండి..

కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నారా.. ఈ ఏడాది రిలీజైన కొత్త మోడల్స్ లో బెస్ట్ మోడల్ ఏది, ఏ సెగ్మెంట్ లో ఏది బెటర్ ప్రైజ్ కి వస్తుంది వంటి అనాలసిస్, రీసర్చ్ చేసి అలసిపోతున్నారా..ఎంత రీసర్చ్ చేసినా ఏ కార్ కొనాలో తెలియడం లేదా.. అయితే మార్చి నెలలో రిలీజ్ కానున్న ఈ కొత్త మోడల్స్ పై లుక్కేయండి.. మీ రీసర్చ్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. అధునాతన ఫీచర్లతో, స్టన్నింగ్ లుక్స్ తో వస్తున్న ఈ మోడల్స్ లో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి.. 

మారుతి సుజుకి ఈ - విటారా

లాంచ్ తేదీ: మిడ్ మార్చి, 2025

ఎక్స్ షోరూం ధర: రూ. 17లక్షలు ( అంచనా )

2025లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతోంది... ఈ విటారా బ్రాండ్ తో ఈ సెగ్మెంట్ లోకి అడుగు పెడుతోంది మారుతి సుజుకి.49 కిలోవాట్లు, 69 కిలోవాట్లతో డ్యుయల్ బ్యాటరీ ఫీచర్ తో ఈ మోడల్ ని లాంచ్ చేయనుంది మారుతి సుజుకి. డ్యుయల్ బ్యాటరీ ఫీచర్ వల్ల ఈ మోడల్ 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మోడల్ లో డ్యుయల్ స్క్రీన్ సెటప్ తో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ ఉండనుంది. డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉండనున్నాయి. 

టాటా హారియర్ ఈవీ:

లాంచ్ తేదీ: మార్చి 31, 2025
ఎక్స్ షోరూం ధర: రూ. 30లక్షలు ( అంచనా )

టాటా హరియర్ ఈవీ ICE- పవర్డ్ డిజైన్‌ తో రానుంది..దీని పవర్‌ట్రెయిన్ డీటెయిల్స్ ఇంకా రివీల్ కానప్పటికీ.. హారియర్ ఈవీ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని టాటా ధృవీకరించింది, హారియర్ ఈవీ 500 Nm టార్క్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

MG సైబర్ స్టర్:

లాంచ్ తేదీ: 2025 మార్చి మిడ్ వీక్ 
ఎక్స్ షోరూం ధర: రూ. 50 లక్షలు ( అంచనా )

MG సైబర్ స్టర్ మోడల్ ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రదర్శించింది ఎంజీ. ఈ మోడల్ సాఫ్ట్ టాప్ తో సీజర్ డోర్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. సైబర్ స్టర్ 77 KWh బ్యాటరీ ప్యాక్ తో ఒకే ఛార్జ్ లో డ్రైవింగ్ పరిధి 570 కిలోమీటర్ల రేంజ్ లో వస్తుందని తెలుస్తోంది.

కియా ఈవీ 6:

లాంచ్ తేదీ: 2025 మార్చి మిడ్ వీక్ 
ఎక్స్ షోరూం ధర: రూ. 63 లక్షలు ( అంచనా ) 

కొరియన్ ఆటో మేకర్ కియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది.  హై లిమోసైన్ వేరియెంట్ గ్లోబల్ గా ఇకనుంచి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. 

వోల్వో XC90 ఫేస్ లిఫ్ట్:

లాంచ్ తేదీ: 04 మార్చి 2025

ఎక్స్ షోరూం ధర: రూ. 1.05 కోట్లు (అంచనా)

వోల్వో  2025 XC90 ఫేస్‌లిఫ్ట్‌ను మార్చి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది వోల్వో. ఇందులో రీఫ్రెష్డ్ బంపర్, స్లీకర్ LED హెడ్‌లైట్‌లు, టెయిల్‌లైట్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్‌తో సహా ఇతర కాస్మెటిక్ అప్డేట్స్ తో రానుందని తెలుస్తోంది.

మెర్సిడెస్-మేబ్యాక్ SL 680:

లాంచ్ తేదీ: 17 మార్చి 2025

ఎక్స్ షోరూం ధర: రూ. 3 కోట్లు (అంచనా )

మార్చి 17న మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ సిరీస్ ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది మెర్సిడెస్.

మెర్సిడెస్ మార్చి 17, 2025న మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ సిరీస్ లాంచ్‌ను ధృవీకరించింది. ఇది టూ సీటర్ తో వస్తున్న ఫస్ట్ మేబ్యాక్ మోడల్. మేబ్యాక్ SL 680 డ్యూయల్-టోన్ రెడ్ అండ్ బ్లాక్ ఎక్స్ టీరియర్ తో, సొగసైన LED హెడ్‌లైట్‌లు, పెద్ద 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ప్రీమియం డిజైన్‌ తో ఉంటుందని తెలుస్తోంది.