భక్తులందరికీ అమ్మవార్ల దీవెనలు ఉంటయ్: మంత్రులు సీతక్క, కొండా సురేఖ

భక్తులందరికీ అమ్మవార్ల దీవెనలు ఉంటయ్: మంత్రులు సీతక్క, కొండా సురేఖ

మేడారం(ములుగు), వెలుగు: సమ్మక్క, సారలమ్మల దీవెనలు భక్తులందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి మేడారం రాక ముందు సీతక్క మీడియాతో మాట్లాడారు. జాతరను కలెక్టర్​ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్​శబరీశ్​నిత్యం పర్యవేక్షిస్తున్నారని, భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. భద్రతా పరమైన అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. జాతరలో వసతుల కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించిందని తెలిపారు.

లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ జాతరకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం మరువలేనిదన్నారు. సక్సెస్​చేసేందుకు ప్రతీఒక్కరూ కృషి చేశారన్నారు. అమ్మవార్లపై విశ్వాసంతో రానురాను జాతరకు భక్తుల రాక పెరుగుతోందన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.