రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం చటాన్ పల్లి సమీపంలో ఉన్న చెరువులో చేపలు చనిపోయాయంటూ మత్స్య కారులు సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. చెరువు సమీపంలో ఉన్న ప్రయాగ్ న్యూట్రి చాక్లెట్ పరిశ్రమ నుంచి వచ్చిన కాలుష్య వ్యర్ధాల వల్లే లక్షల విలువైన మత్య్స సంపద నాశమైందని ఆరోపించారు.
వర్షం పడ్డప్పుడల్లా పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలను చెరువులోకి వదులుతుంటారని, వాటి వల్లే చేపలు చనిపోయాన్నారు మత్య్సకారులు. యాజమాన్యం మత్సకారులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.