ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వైన్​ షాపులు బంద్

ఆసిఫాబాద్, వెలుగు: టెండర్లలో షాపులు తీసుకొని నడిపించుకుంటుంటే కల్తీ చేస్తున్నారని బద్నాం చేస్తున్నారంటూ వైన్​షాపుల యజమానులు వాపోయారు. ఇందుకు నిరసనగా బుధవారం జిల్లా కేంద్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూకుమ్మడిగా బంద్ పెట్టారు. 

ఓ దినపత్రికలో వైన్ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నారంటూ వార్త వచ్చింది. ఎలాంటి కల్తీ లేకపోయినా అసత్య కథనాలు రాయడం ఏమిటని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో వ్యాపారం చేస్తున్న తమని తప్పుగా చూపించడం అవమానించడమే  అవుతుందన్నారు. చర్యలు తీసుకునే వరకు షాపులు తెరవమని వెల్లడించారు.