మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు

మునుగోడు : మునుగోడులో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మునుగోడులో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. 

నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొననున్నారు. మునుగోడుకు వెళ్లే అన్ని వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పర్తి క్రాస్ రోడ్డు వద్ద మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ ను తనిఖీ చేశారు.