రాజకీయ నిరుద్యోగులంతా ఒకరోజు దీక్ష చేస్తున్నారు

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగులంతా ఒక్కరోజు ఒక్కరోజు దీక్ష చేస్తున్నారని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్రం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నియమాకల్లో బీజేపీ కంటే టీఆర్ఎస్సే బెటర్ అన్నారు. కేటీఆర్ బిడ్డపై కామెంట్స్ చేస్తే ఉరుకోబోమన్నారు. తమకు 60లక్షల సైన్యం ఉందని.. మేం ఆలోచనచేస్తే వేరే లెవల్ ఉంటదన్నారు. కేసీఆర్ తినడానికి కూడా వడ్లు వేసుకోవద్దా..ఝ అని ప్రశ్నించారు తలసాని. రైతుల బాధలు చూడలేక.. రైతుల అవసరాలు  తీర్చాలని కేంద్రాన్ని అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్రాన్ని తాము మెహర్బానీ అడగడం లేదని చట్టం ప్రకారం ధాన్యమంతా కొనాలని అడుగుతున్నామన్నారు. ఆహారం లేని ప్రాంతాలకు సరఫరా చేసే బాధ్యత కేంద్రానిది కాదా..? అని తలసాని ప్రశ్నించారు.

సరైన ఆహారం అందని వారు దేశంలో కోట్ల మంది ఉన్నారు.. కరోనా ప్రబలినప్పుడు మన రాష్ట్రానికి సంబంధం లేని వారు 23 లక్షల మందికి భోజనం పెట్టాం.. డబ్బులిచ్చాం.. స్వస్థలాలకు వెళ్లడానికి రైళ్లు ఏర్పాటు చేశాం.. మా పరిధిలోనిది కాకపోయినా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో స్పందించి చేశారని తలసాని వివరించారు. కేంద్రంలోని మంత్రి పీయూష్ గోయల్ ఒకటి చెబితే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెబుతున్నారు.. కేంద్ర మంత్రి గారు.. కనీసం మీ వారికైనా చెప్పుకోలేకపోతే ఎలా..? రైతాంగం నష్టపోయే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులు చనిపోయిన తర్వాత పార్లమెంటులో చర్చ లేకుండానే ఉప సంహరించుకున్నారు.. మళ్లీ కేంద్ర మంత్రులు మార్చి మళ్లీ చట్టాలు తీసుకొస్తామంటున్నారు.. ఎవరిని ఉద్దరించడానికి.. ఏం చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. విపక్షాల ఆందోళనలు అర్ధం లేనివన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. తెలంగాణలో జరిగే అభివృద్ధి పనులు ఏ రాష్ట్రంలో జరగడంలేదన్నారు.

 

ఇవి కూడా చదవండి:

డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న స్థానికులు

మేం ఇలాగే అణచివేసి ఉంటే తెలంగాణ వచ్చేదా..?

కిలోల కొద్దీ బంగారం.. నోట్ల గుట్టలు సీజ్