డిండి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని, ప్రతిపక్షాలతో ఒరిగేదేమిలేదని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన సాయిబాబా టెంపుల్లో మాట్లాడారు. రానున్న రోజుల్లో నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
డిండి ఎత్తిపోతల పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించామని తెలిపారు. నక్కలగండి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తే డిండికి నాలుగు టీఎంసీల నీటిని నింపుకునే అవకాశం ఉందని, డిండి జలాశయం తలుపులు పూర్తి చేసేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆయన వెంట నాయకులు యాదగిరిరావు, దామోదర్‌రావు, రాఘవేందర్రావు, లక్ష్మారెడ్డి, గుర్రం రాములు తదితరులున్నారు.