ఉరంటేనే కొండంత అండ అని నిరూపించారు గ్రామస్తులు..నిరుపేద కుటుంబానికి చెందిన ఓయువతి పెళ్లికి సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఊరంతా పెళ్లి పెద్దలుగా మారి దగ్గరుండి మరీ అంగంగ వైభవంగా పెళ్లి జరిపించి వధూవరులను సాగనంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం అనంతారం గ్రామంలో జరిగింది.
కూతురు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు మేమున్నామంటూ అండగా నిలిచారు అనంతారం గ్రామస్థులు. గ్రామస్తులంతా కలిసి తోచినంత సాయాన్ని అందజేశారు. పెళ్లికి అవసరమయ్యే సామగ్రితో పాటు ఇతర ఖర్చులన్నీ గ్రామస్తులే భరించారు. గ్రామంలోని ఫోటోగ్రాఫర్, ఇతర నిర్వాహకులు సైతం ఉచితంగానే సామాగ్రి అందజేశారు. ఏర్పాట్లలో ఏ మాత్రం లోటు లేకుండా ఘనంగా యువతి వివాహం దగ్గరుండి జరిపించారు.
గ్రామస్తుల సాయంపై యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇలా ఉండగా పేదింటి అమ్మాయి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్తులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆపదలో ఉన్న ఫ్యామిలీకి అండగా ఉండటం గొప్ప విషయమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.