రాజగోపాల్ చెప్పే మాటలన్నీ బూటకాలు : మధుయాష్కీ గౌడ్

రాహుల్ పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత  మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాలో ప్రభుత్వం అన్ని వనరులు దోచుకుంటుందని ఆరోపించారు. ఆపరేషన్ బొగ్గు వ్యాపారం విస్తరణ కోసం జరిగిందన్న ఆయన... చంద్రగుప్త కోల్ ప్రాజెక్టు దక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడు ప్రజలను ముంచి వ్యాపారం కోసం రాజగోపాల్ రెడ్డి పాకులాడారని విమర్శించారు. మొదటి టెండర్ లో లేని  సుశీ ఇన్ ఫ్రాటెక్ రెండవ టెండర్ లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 

రాజగోపాల్ చెప్పే మాటలన్నీ బూటకాలని మధుయాష్కీ అన్నారు. ఆయన పేలాలు పంచి బిర్యానీ తింటున్నాడని ఆరోపించారు. బేరసారాలు, బెదిరింపులకు పాల్పడటం అలవాటుగామారిందన్న ఆయన... కోల్ ఇండియా ప్రాజెక్టు పథకం ప్రకారమే సాగిన అగ్రిమెంటని చెప్పారు. మునుగోడు ప్రజలు మంచి తీర్పు ఇవ్వకుంటే భవిష్యత్ లో రాజకీయం నీచంగా మారుతుందని, రాజగోపాల్ రెడ్డి క్విడ్ కో ప్రోకు పాల్పడ్డాడని కామెంట్ చేశారు.