జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 102 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ఠ ధర రూ.7150, మద్దతు ధర రూ.7,100, కనిష్ఠ ధర 6,900 పలికింది. అదేవిధంగా బస్తాల్లో 10 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ఠ ధర 6,700, కనిష్ఠ ధర రూ.6,600 పలికింది.
జమ్మికుంట పత్తి మార్కెట్లో ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల కింద రూ.6,800 వరకు ఉన్న పత్తి ధర నేడు రూ.7,200 వరకు చేరిందని మార్కెట్ సెక్రటరీ మల్లేశం తెలిపారు. రైతులు తేమ శాతం తక్కువగా ఉండేలా పత్తిని ఆరబెట్టి తీసుకుని రావాలని సూచించారు.