లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారు. ధన్‌బాద్ నుంచి పోటీ చేసిన సునైనా కిన్నార్‌కు 3 వేల 462 ఓట్లు వచ్చాయి. దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసిన రాజన్‌సింగ్‌కు 325 ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ లోని దామో నుంచి ఎన్నికల బరిలో నిలిచిన దుర్గా మౌసీ 1,124 ఓట్లు సాధించారు. ఇప్పటివరకు భారత్ లో ఏ ట్రాన్స్‌జెండర్ కూడా లోక్ సభకు ఎన్నిక కాలేదు. తాజాగా పోటీ చేసిన ఈ ముగ్గురు కూడా తమ డిపాజిట్లను కోల్పోయారు.
డిపాజిట్లు కోల్పోవడం అంటే నామినేషన్ సమయంలో డిపాజిట్ చేసిన డబ్బుని ఆ అభ్యర్థికి తిరిగి చెల్లించకపోవడం. నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు (16 శాతం ప్లస్) వస్తేనే ఫలితాల అనంతరం రిటర్నింగ్ అధికారి డిపాజిట్‌ను ఆయా అభ్యర్థులకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అవి కోల్పోయినట్లే