పిల్లలు తప్పు చేస్తే తన్ని, తాట తీయాలి వెనకేసుకొస్తే ఇదే గతి : కుటుంబాన్ని జైలుకు ఈడ్చిన కొడుకు

పిల్లలు తప్పు చేస్తే తన్ని, తాట తీయాలి వెనకేసుకొస్తే ఇదే గతి : కుటుంబాన్ని జైలుకు ఈడ్చిన కొడుకు

పదిహేడేళ్లకే ఇష్టం వచ్చినట్లు తిరుగురా బెటా అని గర్జరీ కారు, పబ్బులకు పోరా అని పైసలు, ఏం చేయాలనిపిస్తే అది చేసేయ్.. మన దగ్గర పైసలు మస్తు ఉన్నాయనే ధీమా.. ఓ తప్పు దాని విలువ రెండు ప్రాణాలు..ఆ తప్పును కప్పిపుచ్చబోయి కుటుంబం మొత్తం జైలుపాలు. ఓ 17ఏళ్ల మైనర్ బాలుడు మే 19 అర్థరాత్రి కోట్లు విలువ చేసే గర్జరీ కారు పోర్స్చే గంటకు 200కి.మీ వేగంతో వెళ్లి బైక్ వెనుక నుంచి ఢీకొట్టాడు.

తాత, తండ్రి, తల్లి అరెస్ట్

అంతకు ముందే అబ్బాయి పబ్బులో ఫ్రెండ్స్ తో తప్పతాగి బయటకు వచ్చాడు. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న జంట అక్కడికక్కడే చనిపోయారు. ఇది కేసు.. ఈ కేసులో మొత్తం సినిమా రేంజ్ లో ట్విస్లులు. నిందితునిది బాగా డబ్బున్న కుటుంబం. తండ్రి బిజినెస్ మ్యాన్ కోట్ల కొద్దీ ఆస్తి ఉంది. కొడుకు చేసింది తప్పని చెప్పక సాక్ష్యాలు తారుమారు చేసి కేసు నుంచి తప్పించాలని చూశారు. చివరికి అతని తల్లి, తండ్రి, తాతతోపాటు మరో ఇద్దరు డాక్టర్లు జైలుకు వెళ్లారు. కేసు ఇంకా అయిపోలే ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఒక తప్పు వంద తప్పులకు దారితీస్తుంది అన్న మాట ఈ సిచ్యువేషన్ కు కరెక్ట్ గా సెట్ అవుతుంది.

సాక్ష్యాలు తారుమారు చేయాలని..

ప్రమాదం జరిగినప్పుడు బాలుడు డ్రైవింగ్ చేయలేదని డ్రైవర్ కారు నడిపాడని నిందితుని తండ్రి విశాల్ అగర్వాల్ తారుమారు చేయాలని చూశాడు. ఇక బాలుడి తాత సురేంద్ర అగర్వాల్ డ్రైవర్ ని కిడ్నాప్ చేసి చేయని నేరాన్ని ఒప్పుకోవాలని బలవంతం చేశాడు. ఈ కేసులో పోలీసులు బాలుడి తండ్రి, తాతను సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అరెస్ట్ చేశారు. మైనర్‌ బ్లడ్ శాంపిల్స్‌ను వైద్యులు మార్చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సాసూన్‌ ఆస్పత్రికి చెందిన వైద్యులు అజేయ్‌ తావ్‌రే, శ్రీహరి హార్నూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్‌ విభాగం చీఫ్‌గా పనిచేస్తోన్న తావ్‌రే.. మైనర్‌ రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్‌ ఆనవాలు లేవని నివేదిక ఇచ్చారు. ఇంకా యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడకు వచ్చిన పోలీసులకు కూడా కొనేశారు.  బ్లడ్ టెస్ట్ లో పిల్లాడి రక్తానికి బదులు అతని తల్లి శివాని అగర్వాల్ బ్లడ్ ఇచ్చారు. ఇలా అబ్బాయి ఆల్కహాల్ తాగలేదని రిపోర్ట్స్ తెప్పించారు. కేసు సైలెంట్ గా సైడ్ చేద్దామనుకున్నారు.  

తీగ పట్టుకొని లాగితే డొంకంతా

కానీ తీగ పట్టుకొని లాగితే డొంకంతా కదిలింది. కొడుకుని వెనుకేసుకొస్తూ కుటుంబం రోడ్డున పడ్డది. కానీ పబ్బు సీసీటీవీ పుటేజీలో మాత్రం మైనర్ బాలుడు దర్జాగా సోఫాలో కూర్చొని మందేస్తున్నడు. ఆ వీడియో పోలీసులకు చిక్కింది. దీంతో ముంభై పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ కేసు వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలేది లేదని తేల్చి చెప్పారు. చివరికి సాక్ష్యాలు తారుమారు చేసిన నేరం కింద మైనర్ బాలుడి తల్లిని కూడా జూన్ 1న అరెస్ట్ చేశారు.