స్వాతంత్య్రం తరువాత భారత్ ఎన్ని యుద్దాలు.. ఏఏ దేశాలతో చేసిందో తెలుసా..

స్వాతంత్య్రం  తరువాత భారత్ ఎన్ని  యుద్దాలు.. ఏఏ దేశాలతో  చేసిందో తెలుసా..

భారతదేశం స్వాతంత్య్రం  పొందినప్పటి నుండి, భారతదేశం తన భూభాగానికి తన శత్రుదేశాలైన చైనా మరియు పాకిస్తాన్‌ల నుండి నిరంతరం భయం కారణంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే భారత సైనికులు దేశాన్ని బాహ్య మరియు అంతర్గత శత్రువుల నుండి రక్షించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు, అందుకే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సైన్యాలలో ఒకటిగా పరిగణించబడ్డారు. 1962 ఇండో -చైనా యుద్ధం మినహా స్వాతంత్య్రం తర్వాత ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణలో భారతదేశం గెలిచిందనే వాస్తవం భారత సాయుధ దళాల ధైర్యం...  పరాక్రమానికి నిదర్శనం.  స్వాతంత్య్రం తర్వాత భారతదేశం చేసిన అన్ని యుద్ధాల గురించి వివరంగా తెలుసుకుందాం...

దేశవ్యాప్తంగా  ఈ నెల 15న  స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి.  బ్రిటిష్ (British) పాలన నుంచి స్వేచ్ఛను పొందిన భారత్.. దాన్ని రక్షించుకోవడానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన మిలటరీ శక్తిని సమకూర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో నాలుగో స్థానంలో భారత్ కొనసాగుతోంది. భారత్ శాంతికాముక దేశం.. అయినప్పటికీ మన భూభాగం జోలికి ఎవరైనా వస్తే చీల్చిచెండాడుతుంది. ఈ క్రమంలోనే భారత్ 1947 నుంచి ఇప్పటివరకు మొత్తం రెండు దేశాలతో ఆరు యుద్ధాలు చేసింది. వాటిలో ఒక యుద్ధాన్ని ఘర్షణగానే చెబుతుంటారు. కేవలం ఒక్క యుద్ధంలోనే భారత్ ఓడిపోయింది. భారత్ మొదటి యుద్ధాన్ని 1947లో... చివరి యుద్ధాన్ని 1999లో చేసింది. 1967లో చైనాపై భారత్ విజయం సాధించింది.

1947  ఇండో పాక్ యుద్ధం

దేశానికి స్వాతంత్య్రం రాగానే పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడి యుద్ధానికి కారణమైంది. జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు పాల్పడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ తమ భూభాగమని చెప్పుకుంది. దీంతో భారత్-పాక్  మధ్య యుద్ధం జరిగింది. 1947 అక్టోబరు 22 నుంచి 1949 జనవరి 5 వరకు యుద్ధం కొనసాగింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.ఈ యుద్ధంలో దాదాపు 2వేల మంది జవాన్లు ప్రాణాలు అర్పించారు. కాల్పుల విరమణ షరతు ప్రకారం, పాకిస్తాన్ తన బలగాలను ఉపసంహరించుకుంది

1962 భారత్-చైనా యుద్ధం

సరిహద్దుల వద్ద చైనా ఆక్రమణలను అడ్డుకునేందుకు భారత్ యుద్ధం చేసింది. 1962 నవంబరు 21న ప్రారంభమైన యుద్ధం కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత అదే ఏడాది అక్టోబరు 20న ముగిసింది. అక్సాయ్ చిన్, నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, అసోంలో ఈ యుద్ధం జరిగింది. భారత్ అరుణాచల్ ప్రదేశ్ లో భారీగా భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.  చైనా దళాలు టిబెట్‌ను ఆకస్మికంగా స్వాధీనం చేసుకున్నాయి.   ధైర్యవంతులైన 20 వేల మంది భారత సైనికులు చైనాకు చెందిన 80 వేల  మంది సైనికులను ఎదుర్కొన్నారు ఈ యుద్ధంలో రెండు వైపుల నుండి 6వేలకు పైగా   సైనికులు మరణించారు . ఈ యుద్దంలో చైనా విజయం సాధించింది.

1965 ఇండో-పాక్ యుద్ధం

చైనాతో మూడు సంవత్సరాల యుద్ధం తర్వాత, భారతదేశం మరొక శత్రు దేశం పాకిస్తాన్ తో యుద్దం చేయాల్సి వచ్చింది.  కశ్మీర్ కోసం భారత్-పాకిస్థాన్ రెండోసారి యుద్ధం చేశాయి. 1965లో కాశ్మీర్‌లో కాల్పుల విరమణ రేఖపై రహస్య ఆపరేషన్‌ను ప్రారంభించింది.   కచ్‌లోని కంజర్‌కోట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న పాక్ సైనికులు కాశ్మీరీలుగా అభివర్ణించడంతో మొదట దాడి చేశారు. ఇది జమ్మూ కాశ్మీర్‌లో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసింది. 1965 సెప్టెంబరు 23 నుంచి..1966  ఏప్రిల్ 8 వరకు యుద్ధం జరిగింది. భూభాగాల్లో ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు. ఈ యుద్దంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు సుమారు 12 వేల మంది ప్రాణాలు అర్పిచారు. 

1967 భారత్-చైనా యుద్ధం

నాథులా, చోలా ఘర్షణలు, చైనా-భారత్ ప్రతిష్టంభన, సైనో-ఇండియన్ వార్ అని కూడా అంటారు. సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1962 యుద్ధంలో గెలిచిన అహంకారంతో చైనా ఉంది. భారత్ ఈ సారి భీకరంగా పోరాడి, చైనాకు బుద్ధి చెప్పింది. నాథూలా వద్ద ఇరు దేశాల సైన్యాలు గస్తీని పెంచాయి. 1967 సెప్టెంబరు 11 నుంచి 14 మధ్య నాథులాలో ఘర్షణలు జరిగాయి. మళ్లీ అదే ఏడాది అక్టోబరు 1న చోలాలో ఇరు దేశాల సైనికులు ఘర్షణలకు దిగారు. భారత్ సైనికుల వీరోచిత పోరాటం ధాటికి చైనా సైన్యం వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

1971 ఇండో-పాక్ యుద్ధం

పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కోసం చేసిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. 1971 డిసెంబరు 3 నుంచి 16 వరకు ఈ యుద్ధం జరిగింది. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించింది భారత్.  బెంగాలీ జాతీయవాద శక్తుల వైపు తూర్పు పాకిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోసం యుద్ధంలో భారతదేశం ప్రవేశించడానికి దారితీసింది. 13 రోజులు తరువాత పాకిస్తాన్ మిలిటరీ తూర్పు కమాండ్ లొంగిపోయే ఒప్పందంపై సంతకం చేయడంతో భారతదేశం విజయం సాధించింది.  ఆ రోజు బంగ్లాదేశ్ కొత్త దేశం ఏర్పడటానికి కూడా గుర్తుగా ఉంది. ఈ యుద్ధంలో 3 లక్షల మందికి పైగా సైనికులు మరణించారు.

1999 కార్గిల్ యుద్ధం

భారత్‌లోని కార్గిల్ ను ఆక్రమించుకునేందుకు పాక్ పన్నిన కుట్రను భారత్ తిప్పికొట్టింది. ఈ యుద్ధం 1999 మే 3  నుంచి  జులై 26 వరకు జరిగింది. భారత సైనికుల పోరాటం ధాటికి పాక్ తోకముడుచుకుంది. మ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో 1999 మే మరియు జూలై మధ్య యుద్ధం జరిగింది. జూలై 26, 1999న, భారతదేశం హై ఔట్‌పోస్టులను విజయవంతంగా నిర్వహించింది. కార్గిల్ యుద్ధం 60 రోజుల పాటు కొనసాగింది.