మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ జి. రవినాయక్ ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన వర్క్స్‌పై ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలు, మున్సిపల్ అధికారులతో వీసీ నిర్వహించారు. సీడీపీ, ఎస్పీఎఫ్ తదితర పథకాల కింద చేపట్టిన పనులపై ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ ఏజెన్సీల వారిగా సమీక్షించారు.
ALSO READ : టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి: అనుముల సురేశ్
కళాభారతి, స్లాటర్ హౌస్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, జంక్షన్ల డెవలప్ మెంట్ తదితర పనులపై రివ్యూ చేశారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.