![Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ నుంచి యువ సంచలనం ఔట్](https://static.v6velugu.com/uploads/2025/02/allah-ghazanfar-has-been-ruled-out-of-icc-champions-trophy-2025-and-the-ipl_ei7y5Ic8E1.jpg)
ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్ సంచలనం అల్లా గజన్‌ఫర్ గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2025 సీజన్ కు దూరమైనట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.ఇటీవలి జింబాబ్వే పర్యటనలో 18 ఏళ్ల స్పిన్నర్ కు వెన్నుపూసలో పగులు వచ్చింది. దీంతో కనీసం నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటనలో తెలిపింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆఫ్ఘనిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది.
గజన్‌ఫర్ తన వన్డే కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఇప్పటివరకు ఆడిన 11 వన్డేల్లో 13.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 19 టీ20ల్లో 6.12 ఎకానమీతో 30 వికెట్లు పడగొట్టాడు.అల్లా గజన్‌ఫర్ ఆఫ్ఘనిస్థాన్ తో పాటు ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. అతని అద్భుత ప్రదర్శన కారణంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఈ యువ స్పిన్నర్ ను ఏకంగా ఐపీఎల్ 2025 వేలంలో అతన్ని రూ.4.8 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. ప్రధాన స్పిన్నర్ గా ముంబై ఇండియన్స్ ఈ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ పై ఆశలు పెట్టుకుంది.
గత ఐపీఎల్ రికార్డులు
అల్లా ఘజన్‌ఫర్ గతంలో 2023, 2024 సీజన్లలో వేలం కోసం తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ, రెండింటిలోనూ అమ్ముడుపోలేదు. అనంతరం కోల్‌కతా ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు బదులుగా ఇతన్ని జట్టులోకి తీసుకుంది. అయితే, సీజన్ మొత్తంలో ఆడే అవకాశమే రాలేదు. ఈ మధ్యనే ఇతడు ఆఫ్గనిస్తాన్ తరుపున వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు.
ALSO READ : Champions Trophy 2025: ఆస్ట్రేలియాకు కష్టకాలం: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్క్ ఔట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ఫజల్హక్, ఫజల్హక్, ఫజల్హక్
🚨 ALLAH GHAZANFAR RULED OUT OF CHAMPIONS TROPHY & IPL 2025 🚨
— Johns. (@CricCrazyJohns) February 12, 2025
- Afghanistan Cricket Board confirms he will be out for a minimum of 4 months due to injury.
He was picked by Mumbai Indians in the IPL. pic.twitter.com/4js1zEgSJ5