సెన్సార్ బోర్డుకు బుద్దుందా.. ఆదిపురుష్ లో డైలాగ్స్ పై హైకోర్టు ఆగ్రహం

ఆదిపురుష్(Adipurush) సినిమాలోని వివాదాస్పద డైలాగ్స్ పై అలహాబాద్ హైకోర్టు(Alahabad high court) మండిపడింది. ఈ విషయంలో సెన్సార్ బోర్డు ఎం చేస్తోంది? భవిష్యత్తు తరాలకు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించింది. అంతేకాదు విచారణకు దర్శకుడు, నిర్మాతలు హాజరుకాకపోవడంఫై కూడా మండీపడింది అలహాబాద్ ధర్మాసనం. 

ఇక ఆదిపురుష్ సినిమాలోని పలు సంభాషణలపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి. అంతేకాదు.. సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని పిటీషన్స్ కూడా దాఖలు అయ్యాయి. ఇందులో భాగంగానే తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆదిపురుష్ సినిమాలోని డైలాగ్స్ పై దాఖలైన పిటీషన్ ను విచారించింది. ఇందులో భాగంగా.. అలహాబాద్ హైకోర్టు సెన్సార్ బోర్డు ను తప్పు బట్టింది. రామాయణం లాంటి గొప్ప ఇతి హాసంలో ఇలాంటి సంభాషణలు పెట్టడాన్ని ఎలా సమర్ధించారు అని ప్రశ్నిచింది. అంతేకాదు ఇలాంటివాటి వల్ల భవిష్యత్తు తరాలకు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు అంటూ మండిపడింది. 

ALSOREAD:తుఫాన్ లో చిక్కుకున్న టైటానిక్ లాంటి షిప్.. ప్రయాణికుల అరుపులు, కేకలు

ఇక ఆదిపురుష్ సినిమాలో అభ్యంతరం వ్యక్తమైన సంభాషణలను మార్చినట్టు మూవీ టీమ్ ప్రకటించింది. మార్చిన డైలాగ్స్ జూన్ 26 నుండి సినిమాలో యాడ్ కానున్నాయి. అంతేకాదు.. సినిమాకు కలెక్షన్స్ భారీగా తగ్గిన నేపధ్యంలో.. టికెట్ రేట్స్ కూడా సగానికి పైగా తగ్గించింది చిత్ర యూనిట్. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా రిలీజ్ చేశారు.