నస్రుల్లాబాద్, వెలుగు: అల్లమ ప్రభు జాతరకు భక్తుల తాకిడి మొదలైంది. బుధవారం మహారాష్ర్ట, కర్నాటక రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలోని అల్లమ ప్రభువును, కొండపై ఉన్న ఆత్మలింగాన్ని దర్శించుకున్నారు. సిద్దన్న కొండ వద్ద ఉన్న నీటి కుంటలో నీటిని తీసుకెళ్లి స్వామి వారికి సమర్పించారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి అగ్ని గుండం నిర్వహించగా, గురువారం రథోత్సవం, జాతర, శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు.