కోనో కార్పస్ మొక్కలతో పర్యావరణ పరిరక్షణ : జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్​రెడ్డి

కోనో కార్పస్ మొక్కలతో పర్యావరణ పరిరక్షణ : జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కోనో కార్పస్ మొక్కలు పర్యావరణానికి హానికరమంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, సోషల్​మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో ఈ మొక్కలను నరికివేయడం ఆపాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్​రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. కోనో కార్పస్ మొక్కలు అన్ని చెట్ల లాగే కార్బన్​ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను ఇస్తాయని తెలిపారు.

ఈ మొక్కలపై జనంలో ఉన్న దురభిప్రాయాలను తొలగించి, శాస్త్రీయ అవగాహన కల్పించడానికి, మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్​లోని సోమాజిగూడ  ప్రెస్ క్లబ్ లో ప్రముఖ సైంటిస్టులతో మీడియా సమావేశం ఏర్పాటుచేశామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కోనో కార్పస్ మొక్కలపై నాలుగేండ్లుగా  సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోందన్నారు.