బచ్చల మల్లి జీవిత కథతో అల్లరోడి సినిమా.. ఇంతకీ ఎవరాయన?

బచ్చల మల్లి జీవిత కథతో అల్లరోడి సినిమా.. ఇంతకీ ఎవరాయన?

ఈ మధ్య ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అందరూ బయోపిక్ ల వెంట పడుతున్నారు. అందులో బాలీవుడ్ ముందు వరుసలలో ఉంటే.. తరువాతి స్థానంలో టాలీవుడ్ ఉంది. అంతెందుకు.. ఇటీవలే మాస్ మహారాజ రవితేజ(Raviteja) స్టూవర్టుపురం దొంగ కథని సినిమాగా తీశారు. టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో వచ్చిన ఈ సినిమా అంతగా ఆడలేదు. కారణాలేమైనా.. సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం టైగర్ నాగేశ్వర రావు తీర్చలేదు. 

ఇక తాజాగా మరో దొంగ జీవిత కథ తెలుగు తెరపైకి రానుందని సమాచారం.  ఆ దొంగ మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ తుని ప్రాంతానికి చెందిన బచ్చల మల్లి. ఈ రౌడీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోందట. సోలో బ్రతుకే సో బెటర్‌ మూవీ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో.. అల్లరి నరేష్‌ బచ్చల మల్లి పాత్రలో కనిపించనున్నారట. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాకు.. బచ్చల మల్లి అనే టైటిల్‌ అనుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుంది. 

బచ్చల మల్లి.. ఆంధ్రప్రదేశ్ తుని ప్రాంతంలో గజ దొంగగా పేరుతెచ్చుకున్నాడు. 1990లో ఆ ప్రాంతాన్ని గడగడలాడించాడు బచ్చల మల్లి. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ కథలో బచ్చల మల్లి జీవిత కథతో పాటు ఒక సామాజిక అంశంపై చక్కటి మెసేజ్ కూడా ఉండనుందని సమాచారం. మరి ఈ బయోపిక్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.