హీరో అల్లరి నరేష్(Allari Naresh) తన కొత్త సినిమాను ప్రకటించాడు. కొత్త దర్శకుడు సుబ్బు మంగాదేవి(Subbu Mangadevi) దర్శకత్వంలో బచ్చల మల్లి(Bachhala Malli) అనే సినిమాను చేస్తున్నాడు. హాస్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ దండ, బాలాజీ గుట్ట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. చేతిలో బీడీ పట్టుకొని మాసిన గడ్డంతో రిక్షాలో కూర్చొని మాసీ లుక్ లో కనిపిస్తున్నాడు.
పేరు - మల్లి 👨🦱
— Hasya Movies (@HasyaMovies) May 28, 2024
ఇంటి పేరు - బచ్చల
చేసేది - ట్రాక్టర్ డ్రైవింగ్ 🚜
ఈ "బచ్చల మల్లి" ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు ❤️🔥
Presenting you all @allarinaresh in and as #BachhalaMalli ☺️
Shoot in progress. In cinemas soon.@Actor_Amritha @subbucinema @RajeshDanda_ pic.twitter.com/eZ4gfutlvO
ఇక పోస్టర్ లో పేరు: మళ్ళీ, ఇంటిపేరు: బచ్చల, చేసేది: ట్రాక్టర్ డ్రైవెర్.. ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతారు. అంటూ బచ్చల మల్లి పాత్ర గురించి వివరించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక అల్లరి నరేష్ కెరీర్ లో 62వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 1990లో దశకంలో తుని ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటలన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. మరి ఈ సినిమా అల్లరి నరేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.