Bachhala Malli Glimpse: ఊర మాస్ లుక్లో అల్లరోడు.. ఎవడికోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి

బచ్చల మల్లి.. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న కొత్త సినిమా. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుట్ట నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు మంగాదేవి తెరకెక్కిస్తున్నాడు. హనుమాన్ మూవీ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియో విడుదల చేశారు మేకర్స్. 

జూన్ 30 అల్లరి నరేష్ పుట్టినరోజు సంధర్బంగా విడుదలైన ఈ వీడియో సరికొత్తగా ఉంది. ఊర మాస్ లుక్ లో అల్లరి నరేష్ కనిపిస్తున్నారు. ఇక ఎవరికోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అని హీరో చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియన్స్ నుండి కూడా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక బచ్చల మల్లి సినిమా విషయానికి వస్తే.. 1990 కాలంలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో హీరో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. మరి చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.