Allari Naresh: సితార బ్యాన‌ర్‌లో అల్లరోడి 63వ సినిమా..కీలకపాత్రలో యంగ్‌ హీరోయిన్‌

Allari Naresh: సితార బ్యాన‌ర్‌లో అల్లరోడి 63వ సినిమా..కీలకపాత్రలో యంగ్‌ హీరోయిన్‌

అల్లరి నరేష్(Allari Naresh)..ఈ పేరు వింటే అల్లరితో కితకితలు పెట్టె ఓ మంచి యాక్టర్ అని అందరికీ గుర్తొస్తుంటాడు. ఇక కొంతకాలంగా వరుసగా సీరియస్ రోల్స్ చేస్తు తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే ఆ ఒక్కటి అడక్కు అంటూ తనదైన పంథాలో కామెడీ ఫిల్మ్ తీసి ఆకట్టుకున్నాడు.

తాజాగా నేడు (జూలై 27న) అల్లరి నరేష్ తన 63వ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించగా, ఇవాళ పూజా కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో  (జూన్ 30న) విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌, ఎంతో క్రియేటివ్గా ఉండి , సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Also Read:-లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి..నో ఛార్జెస్..బట్ ఓ కండీష‌న్‌!

ఈ సినిమాని "ఫ్యామిలీ డ్రామా" మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత, దర్శకుడు మెహర్ తేజ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే వారం నుంచి మొదలుకానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు’ అనే క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్‌ చేసింది. కాగా సరికొత్త కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ మూవీ ఆడియన్స్కు మంచి ఫీలింగ్ కలిగిస్తోందని ఈ సందర్బంగా మేకర్స్  చెప్పుకొచ్చారు. 

ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో అల్లరి నరేష్ కి జోడిగా రుహాని శర్మ నటిస్తుండగా..జిబ్రాన్ సంగీతం అందించనున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఈ మూవీ సితార బ్యానర్లో 29వ సినిమాగా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’.  రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. నైంటీస్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో నరేష్​ మాస్ గెటప్‌‌‌‌లో కనిపించనున్నాడు. రావు రమేష్, రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌‌‌‌లో ‘బచ్చల మల్లి  రిలీజ్ కానుంది.