OTT Action Drama: మూడు ఓటీటీల్లోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

OTT Action Drama: మూడు ఓటీటీల్లోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ బచ్చల మల్లి(Bachhala Malli). ఈ మూవీ 2024 డిసెంబర్ 20న థియేటర్స్లో రిలీజై పర్వాలేదనిపించింది. సింపుల్ స్టోరీని సిన్సియర్‌‌‌‌గా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సుబ్బు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌‌తో ఇంప్రెస్ చేసేలా ప్రయత్నం బాగున్నప్పటికీ కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇపుడీ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఒక్కటికాదు ఏకంగా మూడు ఓటీటీల్లోకి రావడానికి రెడీ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం. 

హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా బచ్చల మల్లి ఫిల్మ్ నిర్మించారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ సుబ్బు మంగాదేవి (Subbu) దర్శకుడు. నరేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ (Amritha Aiyer) నటించింది. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. 

బచ్చల మల్లి ఓటీటీ:

అల్లరి నరేష్ హీరోగా సుబ్బు డైరెక్ట్ చేసిన ‘బచ్చల మల్లి’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. త్వరలో ఈటీవీ విన్ ఓటీటీలోకి రానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించలేదు. సింపుల్ గా డేట్ ను అంచనా వేయగలరా.. కమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

అలాగే సన్ నెక్స్ట్ ఓటీటీ సంస్థ కూడా త్వరలో స్ట్రీమింగ్ అంటూ పోస్ట్ చేసింది. వీటితో పాటుగా ప్రైమ్ వీడియోలో కూడా బచ్చలమల్లి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఏదేమైనా నెల రోజుల లోపే కొత్త సినిమా ఓటీటీకి వస్తుండటంతో ఆసక్తిగా మారింది.

Also Read : షూటింగ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు

అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీ ఆడియన్స్ ను పలకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రానున్న ఈ రెండ్రోజుల్లో సదరు ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

కథేంటంటే::

1985,1995,2005 అనే మూడు టైమ్‌‌ లైన్స్‌‌లో జరిగే కథ ఇది. బచ్చలమల్లి(అల్లరి నరేష్) బాల్యంలో చదువులో స్టేట్ ర్యాంకర్. చిన్నప్పటి నుంచే అన్ని పనుల్లో చురుకుగా ఉంటాడు. తండ్రి సత్య నారాయణ (బలగం జయరామ్) అంటే అతనికి ప్రాణం. కానీ, కొన్ని కారణాల వల్ల తండ్రిపై వీపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తన తండ్రి తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం తనని ఎంతో వేదనకి గురిచేస్తోంది. దాంతో మల్లి చెడు అలవాట్లకి బానిస అవుతాడు. ఎవ్వరికీ నచ్చని మొరటోడిలా మారిపోతాడు. తినడం, తాగడం, పనికి వెళ్లడం, అడ్డొచ్చిన వాళ్లని తన్నుకుంటూ వెళ్లడం.. ఇదే మల్లిగాడికి ఉన్న ఏకైక దినచర్య అనేలా మారుతుంది.

అలాంటి మల్లి జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్) వస్తుంది. అలా అనుకోకుండా తన ప్రేమలో పడిన మల్లి సడెన్ గా వ్యసనాలు వదిలేసి మంచివాడిలా మారతాడు. కానీ, ఒక్కసారిగా మల్లి యధావిధిగా తాగడం మొదలెడతాడు. అలా మారడానికి కారణమేంటీ? ఊళ్లో రాజు (అచ్యుత్ కుమార్) గోని సంచుల వ్యాపారి. అతనికి మల్లికి ఉన్న గొడవేంటీ? వీరిద్దరి మధ్య పోలీస్ అధికారి లక్ష్మీ నారాయణ (రావు రమేష్) పాత్ర ఎలా ఎంట్రీ ఇస్తోంది?

ఒక్కసారిగా గాడిలో పడ్డ జీవితాన్ని మళ్లీ ఏట్లోకి వెళ్లిన మల్లి జీవితం తాలూకు.. ప్రయాణం ఏమైంది? అసలు తన సొంత తండ్రితో కోపం పెంచుకోవడానికి కారణమేంటీ? చివరికి కావేరి ప్రేమను మల్లి సొంతం చేసుకున్నాడా? లేదా? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే బచ్చలమల్లిని కలవాల్సిందే.