- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రావు క్షమాపణ చెప్పాలి
- దళిత సంఘాల నాయకుల డిమాండ్
మంచిర్యాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో ఓటమి భయంతోనే బీజేపీ లీడర్లు కాకా వెంకటస్వామి ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తున్నారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు చేసిన కామెంట్లను ఖండించారు. సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులు రాజకీయంగా ఎదిగితే బీజేపీ లీడర్లు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కాకా మనుమడు వంశీకృష్ణ సేవలను గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపల్లి టికెట్ఇచ్చిందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలను కలుపుకొని వంశీ గెలుపునకు కృషి చేయడాన్ని రఘునాథ్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దళితులను కించపర్చే కామెంట్లను వెనక్కు తీసుకోవడంతో పాటు కాకా ఫ్యామిలీకి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కనుమల్ల నర్సయ్య, దొంతమల్ల శివకుమార్, గజెల్లి రాజమల్లు, ఎర్రోళ్ల నరేశ్, సొల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
కోల్‌బెల్ట్, వెలుగు: రఘునాథ్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సొతుకు సుదర్శన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మందమర్రి పాతబస్టాండ్ ఏరియాలో నిరసన చేపట్టారు. రాజకీయ పదవులు ఉన్నాలేకున్నా కాకా కుటుంబానికి చెందినచెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేస్తున్నారని సుదర్శన్ పేర్కొన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం విశాఖ ట్రస్టు ద్వారా వేల సంఖ్యలో బోర్లు వేయించారన్నారు. బీజేపీ లీడర్ రఘునాథ్అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లీడర్లు ఆఫీజ్, కడలి శ్రీనివాస్, నర్సోజీ, పోలు శ్రీనివాస్ పాల్గొన్నారు.